కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

23 Jul, 2015 01:25 IST|Sakshi
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సమయ పాలనపై ఆగ్రహం
19మంది ఉద్యోగులకు ముఖాలు
ఫైల్ ట్రాకింగ్ ఆన్‌లైన్లు చేయాలని ఆదేశం
 

హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్(డీఆర్వో కార్యాలయం)లో ఉద్యోగుల సమయ పాలనపై కలెక్టర్ వాకాటి కరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్ కార్యాలయంలోని అన్ని విభాగాలను నేరుగా తనిఖీలు చేశారు. ప్రతి సెక్షన్‌లో సూపరింటిండెంట్ పేరు, ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకుని సెక్షన్లో ఖాళీ కుర్చీలపై ఆరా తీశారు. విధులకు సమయానికి రాని ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె.శోభకు ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్ ఫైల్‌ట్రాకింగ్..
 కలెక్టరేట్‌లో సీ సెక్షన్‌లో ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్ ఫైల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి సమాచారం సరిగా రాకపోవడంతో ఫైల్ ట్రాకింగ్ విధానం పక్కాగా అమలు చేయాలని హుకుం జారీ చేశారు. ఫైల్ పర్యవేక్షణకు అనుకూలంగా ఉండే సాఫ్ట్ వేర్‌ను వినియోగించుకుని జవాబుదారిగా ఉండాలని ఆదేశించారు.
 
19మందికి నోటీసులు

 కలెక్టర్ ఆకస్మిక తనిఖీల సందర్భంగా విధుల్లో లేని 19 మంది ఉద్యోగులను గుర్తించి వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. నోటీసు అందుకున్న వారిలో నలుగురు సూపరింటెండెంట్లు విజయలక్ష్మి (డిసెక్షన్), రవీంద్రమోహన్(ఈ), యోగీశ్వర్(జీ), రంగారావు(హెచ్), సెక్షన్ సహాయకులు (14మంది) శివ(ఏ3), ర హీం(బీ1), ప్రవీణ్(బీ2), మేఘన(డీ1), రాజేశ్వర్‌రావు (డీ2) సంతోష్(డీ3), వినయ్‌రెడ్డి(ఈ5), మధుచంద్ర(జీ1), జ్యోతి(హెచ్3), సురేష్(హెచ్5), ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తిరుమల్, ఖర్షీదా,రాజేష్, ఇద్దరు వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు