‘తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఎక్కడ ?’

1 Sep, 2018 02:00 IST|Sakshi

హైదరాబాద్‌: కొట్లాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇస్తోందంటూ శుక్రవారం గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపాన్ని నీటితో శుద్ధి చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, మారోజు వీరన్న, గూడ అంజన్నలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు.

ఇలాంటి మహనీయులను ప్రభుత్వం విస్మరించిందని, వీరి కుటుంబాలకు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌ గౌడ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరేశ్, సాంస్కృతిక సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు