ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష 

9 Nov, 2018 12:25 IST|Sakshi
వృద్ధురాలిని ఓటు అభ్యర్థిస్తున్న స్పీకర్‌

స్పీకర్‌ మధుసూదనాచారి

సాక్షి,భూపాలపల్లి: ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలుపొందడం ఖాయమని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచా రి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని కేటీకే–2 గని సమీప బ్యారెక్స్, మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ తన 5 ఏళ్ల పదవీ కాలంలో భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తెచ్చి కాలనీల్లో అంతర్గత రోడ్లు, విద్యుత్, ఆధునీకరణ పనులు చేపట్టానని చెప్పారు.

సింగరేణి, కేటీపీపీ యాజమాన్యాలతో మాట్లాడి భూపాలపల్లి నుంచి చెల్పూరు వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయించామని, గతంలో లేని విధంగా భూపాలపల్లి అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన భూ పాలపల్లిలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారని, తాను గెలిచిన అనంతరం వారి కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణరవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు పైడిపెల్లి రమేష్, సింగనవేని చిరంజీవి, చెరకుతోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు