క(న)ష్టాలను జయించిన ఆత్మవిశ్వాసం

6 Oct, 2014 23:37 IST|Sakshi

 మహారాష్ట్ర నుంచి మొక్కలు
 మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా మహాత్మాపూలే రావూర్ విద్యాపీఠ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 3,200 దానిమ్మ మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున చెల్లించాడు. వీటిని తన పొలానికి తరలించే సరికి రవాణా కోసం రూ.80,000 వరకు ఖర్చు అయ్యింది.

 దానిమ్మ రకం  ‘బగువా’
 సాగు కోసం ‘బగువా’ రకానికి చెందిన మొక్కలను ఎంచుకున్నాడు. ఒక్కో దానిమ్మ పండు 150 నుంచి 400 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఒక్కో చెట్టుకు 300ల వరకు కాయలు వస్తాయి. మొదటి కాతలో ఒక్కో చెట్టుకు  80 కాయలు కాసి పండ్లుగా మారుతున్నాయి.

 తెగుళ్లు
 దానిమ్మ తోటలకు అత్యధికంగా మ చ్చతెగుళ్లు వస్తాయి. దీంతో దానిమ్మ పండ్లు నేలరాలిపోతాయి. అయితే మొక్కలకు ఎలాంటి  తెగుళ్లు రాకుండా ఎథ్రిల్ అనే మందును పిచికారీ చేశాడు. తోట పర్యవేక్షణ కోసం పూణెకు చెందిన హార్టికల్చర్ అధికారి గణేశ్ కడాయ్‌ను నియమించుకున్నాడు. ప్రతీ 20 రోజుల కోసారి అతను వచ్చి మొక్క ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికోసం అతనికి ప్రతీసారి రూ.10వేలు చెల్లిస్తున్నాడు.

 ఎరువుల వాడకం
 వెంకటరాంరెడ్డి సాగు చేసిన తోటలో అత్యధికంగా సేంద్రియ ఎరువులను వాడాడు. పచ్చిరొట్ట ఎరువుతో పాటు ప్రతీ మొక్కకు రెండుగంపల పశువుల పేడ ఎరువును మొక్కకు నాలుగు వైపులా వేశాడు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇదే పద్ధతిలో ఎరువులు వాడారు.  

  ఏపుగా పెరిగిన తోట
 మూడో ఏడాది వరకు ఒక్కో మొక్క 12 ఫీట్ల వరకు పెరిగింది. ఏపుగా పెరిగిన మొక్కల కొమ్మలను పూత రాకముందే కత్తిరించాడు.  అనంతరం ప్రతీ మొక్కకు వెదురు కట్టెలతో ప్రత్యేక పందిరి వేయించాడు. దీనికోసం రూ.2లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ పందిరి ద్వారా మొక్కల కొమ్మల బరువు వెదురు కట్టెలపై పడుతుంది. దీంతో చెట్టు కొమ్మలు విరిగిపోకుండా కాయలు ఏపుగా ఎదగడంతో పాటు మొక్కకు అవసరమైన వాతావరణం లభిస్తుంది. దానిమ్మ తోట చుట్టూ రూ.60వేలతో 5 లైన్ల సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాను. దీంతో తోటకు అడవి జంతువుల నుంచి రక్షణ లభించింది.

 మొక్కలు నాటే ముందు...
 12 ఎకరాల భూమిలో 14-11 ఫీట్ల మేర జేసీబీతో 3,200ల గోతులు తీయిం చాడు. దీనికోసం రూ.1.5లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. అనంతరం ప్రతీ గోతిలో చెత్తను నింపి కాల్చేశాడు. ఇలా చేయడం వల్ల గోతిలోని హానికారక క్రిములు (బాక్టీరియా, వైరస్ వంటివి) చనిపోతాయి. అనంతరం ఒక్కో గోతి లో పచ్చిరొట్ట వేసి మొక్కను పెట్టి మట్టితో పూడ్చాడు. అంతకు ముందే డ్రి ప్పు ఏర్పాటు చేసుకుని ప్రతీ గోతి నీటి చుక్కలు పడేలా పైపులు బిగించాడు.

  మొదటిసారి దిగుబడి
 పంట వేసి మూడేళ్లైంది. ఈ ఏడాది కాపుగా ఒక్కో మొక్కకు 80 వరకు కాయలు కాశాయి. వీటిని పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌కు తరలించాడు. ఒక్కో కాయకు రూ.5 నుంచి రూ.8 వరకు ధర లభించింది. దీంతో 12 ఎకరాల దానిమ్మ తోటలో మొదటి సారి కాసిన పండ్ల విలువ రూ.12లక్షలు. కూలీలు, రవాణా చార్జీలకు గాను రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. వచ్చే ఏడాది నుంచి వచ్చే కాతంతా లాభాల పంటే.  

 చాలా కష్టపడ్డా
 నాకు 12 ఎకరాల బీడు భూమి ఉంది. దాన్ని ఎలాగైనా సాగులోకి తేవాలని చాలా కష్టపడ్డా. రెండేళ్ల క్రితం వేసిన బోరులో అంగుళంన్నర నీరు రావడంతో దానిమ్మ తోటను సాగు చేయాలని నిర్ణయించుకున్నా. దీనికోసం మహారాష్ట్రలోని షిర్డీ ప్రాంతంలో సాగవుతున్న దానిమ్మ తోటలను సందర్శించా. అక్కడి రైతుల కష్టమే నాకు స్ఫూర్తిదాయకంగా మారింది. - వెంకటరమణారెడ్డి

మరిన్ని వార్తలు