కోడ్‌ ఉండగా మెట్రో ఎలా ప్రారంభిస్తారు? 

20 Mar, 2019 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు నూతన మార్గాన్ని ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. మెట్రో రైలు నూతన మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. కోడ్‌ అమల్లో ఉండగా ప్రారంభానికి గవర్నర్‌ను ఎలా ఆహ్వానిస్తారని, ఆయన ఎలా పాల్గొంటారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ గోపిశెట్టి నిరంజన్‌ ప్రశ్నిం చారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం సీఈఓ రజత్‌కుమార్‌కు ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, నిరంజన్‌ ఈ మేరకు మంగళవారం ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు