మళ్లీ వారే..

7 Apr, 2014 22:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నో మలుపులు.. మార్పులు.. తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారమే ఇదిగో జాబితా అంటూ ఊరించి జారుకున్న కాంగ్రెస్ అధిష్టానం మొత్తానికి సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఎన్ని మలుపులు తిరిగినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచిం ది.
 
మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతిని, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. నిజానికి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారమే తుది మెరుగు లు దిద్దింది. ఈ జాబితానే ఢిల్లీలోని విశ్వసనీయ వక్తుల ద్వారా చేజిక్కించుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం సంచికలో ‘కాంగ్రెస్ టీం ఖరారు’ అనే శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘సాక్షి’ ముందే వెల్లడించిన పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
 
 జాబితాలో అందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, నర్సాపూర్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, పటాన్‌చెరు నుంచి నందీశ్వర్‌గౌడ్, గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, దుబ్బాక నుంచి చెరుకు ముత్యంరెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, నారాయణఖేడ్ నుంచి కిష్టారెడ్డి, సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌గౌడ్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వీరికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీ ఫారం అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన వారిలో ఇప్పటికే చాలామంది నామినేషన్లు సమర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా