ఇంటర్‌ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

27 Apr, 2019 02:11 IST|Sakshi

ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి సీపీఎం వినతిపత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్‌ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారమివ్వాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వపరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతమున్న గ్లోబరీనా సంస్థ టెండర్‌ రద్దు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ సంస్థల జోక్యాన్ని అనుమతించొద్దని ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలి తాల వెల్లడి జవాబుదారీగా వ్యవహరించాల ని, ప్రభుత్వ టెక్నాలజీ సహకారాన్ని తీసు కోవాలని కోరారు. ఇతర ప్రవేశపరీక్షలకు నష్టం కలగకుండా టైం బౌండ్‌గా తిరిగి పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ సందర్భంగా పార్టీ lనేతలు జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహారెడ్డి, టి.జ్యోతి, డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్, పి.సత్యంలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు