రెండేళ్లైనా.. మాయని మచ్చ!

15 Jul, 2017 06:24 IST|Sakshi
రెండేళ్లైనా.. మాయని మచ్చ!

► రిషితేశ్వరి కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటులో జాప్యం
► అమలుకు నోచుకోని చంద్రబాబు హామీ
► ఇప్పటివరకు ర్యాగింగ్‌ దోషులకు పడని శిక్ష


సాక్షి, వరంగల్‌:  ర్యాగింగ్‌ పేరిట వేధించి తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తులు  ఏవేని కారణాలతో శిక్ష నుంచి తప్పించు కుం టారేమోనని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూలై 14తో రిషితే శ్వరి మరణించి రెండేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆవేదనను రిషితేశ్వరి తల్లి దం డ్రులు ఎం.మురళికృష్ణ, దుర్గాబాయి ‘సాక్షి’కి తెలిపారు.  ఆవేదన వారి మాటల్లోనే..

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నాగా ర్జున యూనివర్సిటీలో  రిషితేశ్వరి 2015 జూలై 14న క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుంది. జూలై 30న ఏపీ సీఎం చంద్రబాబును కలి శాం.  ‘దోషులకు శిక్ష పడాలి. మరొకరు ర్యా గింగ్‌ పేరుతో జూనియ ర్లను వేధించకూడదు. క్యాంపస్‌లో తొలి ఏడాది విద్యార్థులు నవ్వుతూ చదువుకోవాలి’ అని మేం చంద్ర బాబుకు చెప్పాం. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కేసు నీరుగారిపోతోంది
రిషితేశ్వరి కేసులో ముగ్గురు సీనియర్లు ముద్దాయిలుగా ఉన్నారు. ఆమె స్నేహితులు సాక్షులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మూడో ఏడాది రెండో సెమిస్టర్‌లో ఉన్నారు. మరో రెండునెలల్లో ఫైనల్‌ ఇయర్‌లోకి వెళ్తారు. సాధారణంగా బీఆర్క్‌ చేసిన విద్యా ర్థులు విదేశాల్లో ఎంఆర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు విదే శాలకు వెళితే కోర్టు విచారణకు హజరు కావడం కష్టం. సాక్షులు లేకపోతే ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి.

మిడిల్‌ మేనేజ్‌మెంట్‌తో సమస్య
రిషితేశ్వరి మరణం తర్వాత నాగార్జున క్యాంపస్‌లో సీసీ కెమెరాలు పెట్టారు, ర్యాగింగ్‌ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబరు అందు బాటులోకి తెచ్చారు. పై స్థాయిలో ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలంటే మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా ఉండాలి. రిషితేశ్వరి చనిపోయాక తొలి వర్దంతికి నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సదస్సు పెడతామని కోరాం.

అధికారులు కేవలం బ్యా చిలర్‌ ఆఫ్‌ ఆర్కి టెక్చర్‌ విద్యార్థుల (200)తో సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు.  రిషితేశ్వరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు సంతోషంగా తిరుగుతున్నారు. మేం అనాథల్లా బతుకుతున్నాం. నిన్న విజయ వాడలో ర్యాగింగ్‌ వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయిందన్న వార్త టీవీల్లో చూసి తల్లడిల్లిపోయాం. రాత్రంతా  ఏడుస్తూనే ఉన్నాం. మా రిషితేశ్వరి కళ్ల ముందు కని పించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడే ఇతరుల్లో మార్పు వస్తుంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చులే అనే భావన సమాజంలో పెరగడం మంచిది కాదు.

>
మరిన్ని వార్తలు