కేసీఆర్‌ కోసం వెళ్లి.. చుక్కలు చూసిన చింతమడక ప్రజలు

6 Dec, 2023 18:56 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఊరి ప్రజలు. గంటల తరబడి బయటే ఎదురు చూడాల్సి వచ్చింది వాళ్లు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. బస్సుల్లో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు బుధవారం చేరుకున్నారు. అయితే ఫామ్‌ హౌజ్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని తెగేసి చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే పడిగాపులు కాశారు. 

దాదాపు మూడు గంటల పాటు వాళ్లు బస్సుల్లోనే ఫామ్‌హౌజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఆగిపోవడంతో.. లోనయ్యారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిసి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

>
మరిన్ని వార్తలు