తలసాని ఆస్తులు ఇవే..!

15 Nov, 2018 14:00 IST|Sakshi
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సాక్షి, సనత్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ పత్రంతో పాటు అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను పొందుపర్చారు. శ్రీనివాస్‌యాదవ్‌ మొత్తం చరాస్తి విలువ తన పేరిట రూ.4.55 కోట్లు, అలాగే ఆయన భార్య పేరిట రూ.61.88 లక్షలుగా పేర్కొన్నారు. ఇవి కాకుండా అవిభాజ్య (ఉమ్మడి ఆస్తి) కింద రూ.6 లక్షలు ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌ ద్వారా తెలిపారు. అలాగే స్థిరాస్తుల విషయానికొస్తే తలసాని పేరిట రూ.7.90 కోట్లు ఆయన భార్య పేరిట రూ.9.15 కోట్లు అవిభాజ్యం పేరిట రూ.17.85 కోట్లుగా పొందుపర్చారు.  
గతంలో కంటే పెరిగిన ఆస్తులు... 
గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తి వివరాలతో పోలిస్తే ఈ సారి అఫిడవిట్‌ ప్రకారం తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆస్తులు పెరిగినట్లు స్పష్టమవుతుంది. గతంలో తలసాని మొత్తం చరాస్తి విలువ తన పేరిట రూ.2,87,78,750లు ఉంది. అంటే గతంతో పోలిస్తే కోటిన్నరకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. అలాగే గత ఎన్నికల సమయంలో ఆయన భార్య పేరిట రూ.40,92,114లుగా పొందుపర్చారు. ఆమె చరాస్తి విలువ ఈ నాలుగున్నర ఏళ్లలో రూ.20 లక్షల మేర పెరిగినట్లు అఫిడవిట్‌ ద్వారా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో అవిభాజ్య ఉమ్మడి చరాస్తి ఆస్తి కింద రూ.11,75,146లుగా చూపించగా గతంతో పోలిస్తే ఐదు లక్షల మేర తగ్గింది. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో పేర్కొన్న స్థిరాస్తుల విషయానికొస్తే తలసాని పేరిట వాటి విలువ రూ.3,90,00000లుగా ఉంది.

దీనిని బట్టి నాలుగున్నర ఏళ్లలో ఆయన పేరిట నాలుగు కోట్ల మేర సిరాస్ధి విలువ పెరిగింది. ఆయన భార్య పేరిట గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో సిరాస్థి విలువ రూ.1,65,70,000లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌ మేరకు ఏడున్నర కోట్ల విలువైన స్థిరాస్తులు పెరిగినట్లు స్పషమవుతుంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో మొదటి సంతానం పేరిట రూ.1,93,843, రెండో సంతానం పేరిట రూ.80,963, మూడో సంతానం పేరిట రూ.1,22,429లు విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు పొందుపర్చారు.  పిల్లల స్థిరాస్తులను చూస్తే...మొదటి సంతానం పేరిట రూ.1,40,00000, రెండో సంతానం పేరిట రూ.37,10,500, మూడో సంతానం పేరిట 33,13,500 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపర్చారు. కానీ ఈ సారి పిల్లల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను తెలియపర్చలేదు.  

మరిన్ని వార్తలు