దేవాదుల పైపులైన్‌ లీకేజీ

26 Jul, 2017 12:40 IST|Sakshi
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరి గూడెం శివారులో దేవాదుల పైపులైన్ గేట్ వాల్వు లీక్‌ అయింది. దీంతో పైప్‌లైన్‌ నుంచి 30 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. అలాగే ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండిరామారం వెళ్లే పైప్ లైన్ మూడుచోట్ల లీక్‌ అయింది. రెండో దశ దేవాదుల పైప్‌లైన్‌ నుంచి సుమారు మూడు గంటలుగా నీరు వృథాగా పోతున్నది. పంట పొలాల్లోకి నీరు భారీగా చేరుకుంది.
మరిన్ని వార్తలు