10వేలను అధిగమించిన నిఫ్టీ | Sakshi
Sakshi News home page

10వేలను అధిగమించిన నిఫ్టీ

Published Wed, Jul 26 2017 12:43 PM

10వేలను అధిగమించిన నిఫ్టీ

ముంబై: తీవ్ర  దోబూచులాటల మధ్య  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  మరోసారి చారిత్రక గరిష్టాన్ని అందుకుంది.   అయిదు అంకెలకు చేరిన నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 10008 వద్ద కొనసాగుతోంది.   వరుసగా రెండో రోజుకూడా 10,000 పాయింట్ల చరిత్రాత్మక మైలురాయిని అందుకుని   మదుపర్లను ఊరిస్తోంది. మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 10,000 పాయింట్ల మైలురాయిని అందుకున్నా.. కొన్ని క్షణాల్లోనే వెనక్కి తగ్గింది.  ట్రేడర్ల  ప్రాఫిట్‌ బుకింగ్‌కారణంగా రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంది.  
 
అటు  దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంటు కారణంగా మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఇండెక్సులు కొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి.  సెన్సెక్స్‌ సైతం 128  పాయింట్ల లాభంతో  32,357 వద్ద  ఉంది.  మెటల్‌, రియల్టీ పాజిటివ్‌గా ఉండగా,  ఫార్మా నష్టాల్లో ఉంది.  ముఖ్యంగా వేదాంత భారీలాభాలతో  మూడేళ్ల గరిష్టాన్ని నమోదు చేసి టాప్‌ గెయిన్‌గా ఉంది. టాటా స్టీల్‌,  ఎంఅండ్‌ ఎం,  జేపీ అసోసియేట్‌ జిందాల్‌ స్టీల్‌, సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, సుజ్లాన్‌, జీఎస్‌ఎఫ్‌సీ, అదానీ పవర్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, హెక్సావేర్‌, వీగార్డ్‌,  గెయిల్ తదితర షేర్లు లాభపడుతున్నాయి.  అయితే దివీస్‌, ఎంఆర్‌పీఎల్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, కేపీఐటీ, ఐడియా, రెప్కో హోమ్‌, పీఎఫ్‌సీ, నిట్‌ టెక్‌, టాటా కమ్యూనికేషన్స్‌ నష్టపోతున్నాయి.  అయితే  జూలై ఎఫ్‌అండ్‌వో  సిరీస్‌లో  మరోసారి 10వేల మార్క్‌ను  అధిగమించడంతో సానుకూల సంకేతంగా  విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే  జూలై ఎఫ్‌అండ్‌వో  సిరీస్‌ ముగింపులో ఈ చారిత్రక గరిష్టాన్ని నిలబెట్టుకోవడంలో సఫల మవుతుందా అనేది టాక్‌ ఆఫ్‌  ది మార్కెట్‌.    

అటు  ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో  బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. పది గ్రా. ధర రూ.153 పతనమైన రూ. 28, 325వద్ద  కొనసాగుతోంది.  

 

 

Advertisement
Advertisement