భద్రాద్రిలో భక‍్తులకు డ్రెస్‌ కోడ్‌

27 May, 2017 20:31 IST|Sakshi
భద్రాద్రిలో భక‍్తులకు డ్రెస్‌ కోడ్‌
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర దేవస్ధానం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. భద్రాద్రి రాముని దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు శ్రీ సీతారామచంద్రుల అంతరాలయ దర్శనానికి ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది.
 
మగవారు పంచె, కండువా, స్త్రీలు చీర లేదా పంజాబి డ్రెస్‌ ధరించి వస్తేనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ప్రత్యేక పూజలు, నిత్య కల్యాణానికి కూడా ఇదే సాంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. ఈ నిబంధన జూన్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు ఖరారు చేస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వార్తలు