వైద్యం.. వ్యాపారం కాదు

22 Nov, 2019 05:33 IST|Sakshi

డాక్టర్లు ప్రజలకు సేవ చేయాలి: ఈటల

సాక్షి, హైదరాబాద్‌: వైద్యం వ్యాపారం కాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ జెనిటిక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన జెనిటిక్‌ న్యూరోమస్క్యులర్‌ డిజార్డర్స్‌ అంశంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైద్యులు 15 ఏళ్లపాటు ఎంతో కష్టపడి చదువుతారని, వారి కష్టాన్ని ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలన్నారు. జెనిటిక్‌ డిజార్డర్‌తో బాధపడే ఒక వ్యక్తికి తాను మూడేళ్లు చికిత్స ఇప్పించానని, కేరళకు పంపి వైద్యం చేయించినా ఆ వ్యక్తి బతకలేదన్నారు. రూ.5 లక్షలు వెచ్చించినా ఫలితం లేకపోయిందన్నారు. పేదలు ఇలా అకస్మాత్తుగా వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా