శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ‘అనుభూతి’ బోగి!

25 Dec, 2017 02:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌–పుణే మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రత్యేక ఆకర్షణ తోడయింది. భారతీయ రైళ్లలో లగ్జరీ కోచ్‌లుగా పేరొందిన ‘అనుభూతి’బోగీని ఈ రైలుకు జత చేయనున్నారు. సోమవారం నుంచి ఒక అనుభూతి బోగీని శాశ్వత ప్రాతిపదికన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు జోడించనున్నారు. శతాబ్ది బోగీలతో పోలిస్తే ఇది చాలా విలాసంగా ఉంటుంది. ప్రతి సీటుకు ఎల్‌సీడీ మానిటర్లు ఉంటాయి. సీటుకు సీటుకు మధ్య కాళ్లు పెట్టుకునేందుకు విశాలమైన స్థలం, కిటికీ అద్దాలకు ప్రత్యేక తెర ఉంటుంది. శతాబ్ది ఏసీ–1 చైర్‌కార్‌లో 56 సీట్లుండగా.. ఈ లగ్జరీ బోగీలో 50 సీట్లు ఉంటాయి. ఏసీ–1 బోగీ టికెట్‌ ధర కంటే అనుభూతి టికెట్‌ ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బోగీ తయారీకి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని తక్కువ సంఖ్యలో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్‌–పుణే శతాబ్దికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఈ లగ్జరీ బోగీని అనుసంధానిస్తున్నారు.

మరిన్ని వార్తలు