ఖమ్మం అభివృద్ధికి రూ.కోట్లు

15 Jul, 2018 10:06 IST|Sakshi
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో రోడ్లనుసీసీ రోడ్లుగా మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని 41, 41వ డివిజన్లలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్‌ పాపాలాల్‌తో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నగరంలో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అవసరాన్ని గుర్తించిన మేరకు నేడు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, కొప్పెర సరిత, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, మెంతుల శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి, వసంతబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యవర్గం భేటీ
ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, భవాని, శ్రీదేవి, ప్రేమబాయి, రమాదేవి, విమల, ప్రేమిలా, జ్యోతి, కల్పన పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు