ఆపరేషన్

9 Jul, 2014 02:58 IST|Sakshi

కలెక్టరేట్: బోగస్ రేషన్ కార్డులకు ఇక చెక్ పడనుందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను రాయితీపై అందిస్తుంది. ఇందుకోసం జిల్లాలో దాదాపు 1,332 చౌకధరల దుకాణాలు. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ ఇతర కార్డులు కలిపి దాదాపు ఏడు లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకు బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు.

 జరగని కార్డుల విభజన
 జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరుగుతున్నా, కార్డుల విభజనకు మాత్రం రాజకీ య గ్రహణం చుట్టుకుంది. కార్టుల విభజ న ఎప్పుడు మెదలు పెట్టినా రాజకీయ ఒత్తి డి కారణంగా మధ్యలోనే నిలిచిపోతోంది. 2008, 2009లో ఈ ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులు ఓ బడానేత, యూని   యన్ నాయకుల ఒత్తిడి మేరకు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కార్డులు తక్కువగా ఉన్న రేషన్ దుకాణాల వారికి నష్టం తప్పలేదు.

 నగరంలో ఇలా
 జిల్లా కేంద్రంలో 87 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందు లో దాదాపు 25 దుకాణాల పరిధిలోనే వెయ్యి నుంచి ఐదు వేల కార్డుల వరకు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి పౌరసరఫరాల కమిషనర్ నిబంధనల మేరకు ఒక్కో రేషన్ షాపులో, మున్సిపాలిటీ పరిధి అయితే 600 నుంచి 650, గ్రామీణ, మండల పరిధి అయితే 400 నుంచి 450 కార్డులు మాత్రమే ఉండాలి. నగరం లో చాలా దుకాణాలలో బోగస్ కార్డులతోపాటు, నిబంధనలకు మించిన కార్డులు ఉన్నాయి.

 రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రీ సైక్లింగ్ చేస్తూ అడ్డం గా దొరకిపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో వెలుగు చూశాయి. అవి కూడా నిజామాబాద్ నగరానికి సంబంధించిన రేషన్ డీలర్ల బియ్యమే అని అధికారులు కూడా తేల్చారు. దీనిపై సీరియస్‌గా స్పం దించిన జేసీ, కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే కార్డుల విభజన మొదలు పెట్టాలని, బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు.

 పనిలో పనిగా
 ఎలాగూ ప్రస్తుతం కార్డులపై ‘డబ్ల్యూఏపీ’ అక్షరాలను తొలగించి, ఆ స్థానంలో డబ్ల్యూటీఎస్‌ను చేరుస్తున్నారు. పనిలో పనిగా కార్డుల విభజన చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో 62 వేల పాత గులాబీ కార్డులు, 40 వేల పింఛన్‌దారులు, మిగతా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్ ఉద్యోగులను కలుపుకొని దాదాపు 30 వేల మంది, ఏపీఎల్ కుటుంబానికి చెందిన వారు మరో 25 వేల మంది వరకు ఉంటారు. ఇవన్నీ కలిపితే దాదాపు లక్షన్నర వరకు పింక్ కార్డులు ఉంటాయి.

 జిల్లాలో దాదాపు రెండు లక్షల వరకు కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలలో లెక్కకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు మరో అడుగు ముం దుకేసి రచ్చబండలో ముందుగానే బినామీ పేర్లతో కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏడు లక్షల వరకు కార్డుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నగరంలో 26 దుకాణాలు, జిల్లావ్యాప్తంగా మరో వంద రేషన్ షాపుల విభజనకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో జిల్లావ్యాప్తం గా మరో 150 వరకు రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు