గ్రామస్తుల ఐక్యతకు ‘విదేశీయుల’ సలామ్‌

17 Nov, 2018 11:41 IST|Sakshi
విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్న చిన్నారులు 

సాక్షి, ఐనవోలు: మండలంలోని ఒంటి మామిడిపల్లి గ్రామస్తుల ఐక్యతను బాల వికాస ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన విదేశీ బృందం ప్రశంసించింది. శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సూడాన్, అఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన 11 మంది సభ్యుల విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను గ్రామస్తులు ఏవిధంగా సమిష్టి నిర్ణయంతో తిరిగి తెరిపించుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందని గ్రామస్తులు తెలియజేశారు.

విదేశీ ప్రతినిధి బృందం గ్రామం మొత్తం తిరిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి çపనుల గురించి సర్పంచ్‌ ఆడెపు దయాకర్, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతిలను అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలవికాస ప్రతినిధులు పీడీటీసీ మేనేజర్‌ సునీత, ఆఫీసర్‌ ఫ్రాన్సిస్‌ మంజుల, గజేందర్, సురేందర్, పాఠశాల చైర్మన్‌ పొన్నాల రాజు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ జైపాల్, రాజు, వెంకన్న, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు