పండుగ పూట విషాదం 

10 Mar, 2020 03:05 IST|Sakshi

చెరువులో మునిగి నలుగురు విద్యార్థుల మృతి

సంగెం/భూపాలపల్లి అర్బన్‌/మల్హర్‌: హోలీ వేడుకలు ముగించుకుని స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసు కున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా కాపులకనిపర్తికి చెందిన కందికట్ల యశ్వంత్‌ (13) బర్ల రాజ్‌కుమార్‌ (13), సదిరం రాకేష్‌ (12), దౌడు రాకేష్‌ (9) స్నే హితులతో కలసి హోలీ ఆడారు. అనంతరం పాయచెరువులో స్నానానికి దిగా రు. యశ్వంత్, దౌడు రాకేష్‌ మొరం కోసం తీసిన గోతిలో పడి చనిపోయారు. వారి వెనుక వెళ్లిన సదిరం రాకేష్‌ తృటిలో బయటపడ్డాడు. అలాగే.. భూపాలపల్లి జవహర్‌నగర్‌ కాలనీ చెందిన మాచర్ల కల్యాణ్‌S(16) మల్హర్‌ మండలం తాడ్వాయి గ్రామ సమీప చెరువుకు వెళ్లాడు. అందులో స్నానం చేసేందుకు దిగి.. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. హసన్‌పర్తి మండలం నిరూప్‌నగర్‌ తండాకు చెందిన భూక్య తిరుపతి (16) గ్రామంలోని దామోదర చెరువులోకి ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు