సోదరభావంతో మెలగాలి

24 Jul, 2014 03:19 IST|Sakshi
సోదరభావంతో మెలగాలి

కులమతాలకతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని కలెక్టర్ గిరిజా  శంకర్ ఆకాంక్షించారు. పండుగలను మతసామరస్యానికి ప్రతీకలని అన్నారు. అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని.. ఇకముందు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. బుధవారం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు.
 
 స్టేషన్ మహబూబ్‌నగర్: కులమతాలకతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. బుధవారం స్థానిక రోజ్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పండుగలను జరుపుకుని, మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు.
 
 జిల్లాలో అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని, ఇకముందు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. రంజాన్‌నెలలో ముస్లింలు ఎంతో నిష్టగా ఉసవాసాలు ఉంటారని వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం అబినందనీయమన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 400 ఏళ్లుగా తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. ఆంధ్రపాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, మైనార్టీల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు.
 
 నామినేటెడ్ పోస్టుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మజీదుల మరమ్మతులకు రూ.30వేల చొప్పున చెక్‌లను అందజేశారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే తదితరులను ముస్లిం ప్రముఖులు శాలువాలతో సన్మానించారు.   కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ శర్మన్, డీఆర్‌ఓ రాంకిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధా అమ ర్, డీఎండబ్యూఓ శీరిష, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ కరీముల్లా, ముస్లిం ప్రముఖులు ఎంఎ.హాది, ఇంతియాజ్, మోసీన్‌ఖాన్, తఖీ హుస్సేన్, ఖుద్దూస్‌బేగ్, అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు