తలసరి వ్యయంలో తెలంగాణ భేష్

30 Jun, 2014 02:46 IST|Sakshi

* ‘సెస్’ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తలసరి వ్యయం, విజ్ఞానం, జీవితకాల పెరుగుదల గతంలో కంటే మెరుగుపడింది. తెలంగాణలో మానవ వనరుల అభివృద్ధి సూచికను రూపొందిస్తున్న ‘సెంటర్ ఫర్  ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’(సెస్) ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక, గణాంక నిపుణు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహోనిలోబస్ జయంతిని జాతీయ గణాంక దినోత్సవంగా జరుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ‘సెస్’ సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో ‘సెస్’  అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం పైమూడు రంగాల్లో తెలంగాణ గతంలో కంటే కొంత ముందంజలో ఉంది. అయితే ర్యాంకుతో పోల్చితే పెద్దగా మార్పు రాలేదు. పై విషయాల్లో ఏపీ పదో స్థానం, తెలంగాణ రాష్ట్రం పన్నెండో స్థానంలో ఉన్నట్లు వివరించారు. తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సూచిక మరో పక్షం రోజుల్లో పూర్తిస్థాయిలో సెస్ రూపొందించి ప్రభుత్వానికి అందచేయనుంది.

>
మరిన్ని వార్తలు