4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌?, కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు!

26 Nov, 2023 08:14 IST|Sakshi

ఇటీవల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్‌ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఎక్స్‌’ వేదికగా పలువురు ప్రముఖులు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ తరుణంలో ఫోర్బ్స్‌ ఇండియా భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (GDP) పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం.. 

మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. దేశ రాజధాని. ఇవన్నీ కలిపి భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని దేశంగా నిలబెడుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత (2023లో) జీడీపీ 3.75 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని తేలింది. జీడీపీని బట్టే దేశాభివృద్ది ఎలా ఉందనే విషయాన్ని గుర్తించవచ్చు. 

ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద’ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్ధం. 

తలసరి జీడీజీ విషయానికొస్తే ఇది దేశంలోని ప్రతి వ్యక్తికి సగటు ఆర్థిక ఉత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి (GDP)ని సూచించే కొలత. ఇది ఒక దేశ మొత్తం జీడీపీని దాని జనాభాతో గుణించడం ద్వారా అంచనా వేయొచ్చు.ఈ రెండు పారామీటర్స్‌ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంత జనాభా ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా కేంద్ర సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జీడీపీ డేటాను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్‌ ద్వారా మన దేశంలోని అత్యంత ధనిక,పేద రాష్ట్రాలను గుర్తింవచ్చు.

మరిన్ని వార్తలు