‘భద్రాద్రి’కి దారి చూపండి!

14 Nov, 2016 02:42 IST|Sakshi
‘భద్రాద్రి’కి దారి చూపండి!

- పర్యావరణ అనుమతులు నిరాకరిస్తే రాష్ట్రానికి భారీ నష్టం
- కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు జెన్‌కో లేఖ
 
 సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మించతలపెట్టిన 1080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇటీవల కేంద్ర పర్యా వరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి త్వ శాఖ(ఎంఓఈఎఫ్) అనుమతులు నిరాకరిం చడంపై రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) తక్షణమే స్పందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ(ఎంఓపీ) పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నెల 4న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-22)లో కేవలం సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను మాత్రమే అనుమతించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి భారీ నష్టం జరగనుందని జెన్‌కో యాజమాన్యం  స్పందించింది.

ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే రూ.1000 కోట్ల వ్యయం చేశామని, ఈ దశలో ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావ రణ అనుమతులను జారీ చేయాలని కోరుతూ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తాజాగా పర్యా వరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.  సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంతో ప్లాంట్‌కు అనుమతినివ్వలేమన్న నిర్ణయం సరికాదన్నా రు. వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు, ప్రభుత్వ రంగా ల్లో 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, ఇవన్నీ 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తి అవుతాయన్నారు. అరుునా, ఒక్క భద్రాద్రి విషయంలోనే అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. 

మరిన్ని వార్తలు