44,000.. దాటిన బంగారం

24 Feb, 2020 02:14 IST|Sakshi

హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం: రూ. 44,430

గ్రాముకు రూ. 4,073 పలికిన 22 క్యారట్ల పసిడి

కోవిడ్‌ ప్రభావంతో పెట్టుబడిదారుల భారీ కొనుగోళ్ల వల్లే ధరల పరుగు!

సాక్షి, హైదరాబాద్‌ : కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసు కెళ్తున్న పుత్తడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. మేలిమి బంగారం (24 క్యారట్లు) ధర హైదరాబాద్‌ మార్కె ట్‌లో రూ. 44 వేలు దాటింది. ఆదివారం జరిపిన విక్రయాల్లో 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 4,443 చొప్పున ధర పలికింది. అంటే 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికిందన్నమాట. అదే ఆభ రణాలకు ఉపయోగించే 22 క్యారట్ల బంగా రం గ్రాముకు రూ. 4,073 ధర పలికినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించా యి. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ. 1,790 పెరిగింది. ఈ నెల 17న రూ. 42,640 ధర పలకగా 23న రూ. 44,430కి చేరింది. ఇక 22 క్యారట్ల బంగారం కూడా రూ. 1,580 మేర పెరిగింది. కోవిడ్‌ కార ణంగా వాణిజ్య రంగంలో ఒడిదుడుకుల ను తట్టుకొనేందుకు పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం ధరలు పెరగడా నికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతు న్నాయి. రూపాయి ధర పతనమైన కొద్దీ బంగారం దిగుమతి ధర పెరుగుతుందని, ధరలు పెంచక తప్పదంటున్నాయి.

మరిన్ని వార్తలు