మళ్లీ వచ్చేది మేమే: కేటీఆర్‌

11 Nov, 2023 13:48 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : డిసెంబర్‌ 3న మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తగ్గిస్తామన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో హైదరాబాద్‌ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

‘నగరంలో ట్రాఫిక్ సమస్యను రాబోయే రోజుల్లో తగ్గిస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తాం. డిసెంబర్ 3న మళ్ళీ మేమే వస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్‌లో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి.  వాటన్నింటినీ పటాపంచలు చేశాం.

రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తాం. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు మరింత పెరగాలి. జీహెచ్‌ఎంసీకి ఒక కమిషనర్‌ సరిపోరు. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్‌లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు ,మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.  

ఇదీ చూడండి..జంగ్‌ తెలంగాణ 

మరిన్ని వార్తలు