ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థలో ‘ఆకలి కేకలు’..!

22 Jun, 2018 13:37 IST|Sakshi
కేంద్రాస్పత్రిలో ఉన్న ఐసీటీసీ సెంటర్‌లో రోగికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న కౌన్సిలర్‌

ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థలో ‘ఆకలి కేకలు’..!

మూడు నెలలుగా జీతాలు చెల్లించని ప్రభుత్వం

అవస్థలు పడుతున్న ఉద్యోగులు

విజయనగరం ఫోర్ట్‌ : జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ పరిధిలో 13 ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 13 మంది కౌన్సిలర్లు, 11 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మరో నలుగురు, విజయనగరం, పార్వతీపురంలలో రెండు ఏఆర్‌టీ  కేంద్రాల్లో 16 మంది పనిచేస్తున్నారు.

జిల్లాలో బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, ఎస్‌.కోటల్లో నా లుగు లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో నలుగురు స్టాఫ్‌ నర్సులు, బ్లడ్‌బ్యాంక్‌లో ఆరుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరిందరికీ మార్చి నెల నుంచి జీతాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌ వంటివి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పుచేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.  

విధులు నిర్వర్తిస్తున్నా... 

ఐసీటీసీ సెంటర్లలో రోగులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయినవారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఏఆర్‌టీ కేంద్రంలో రోగులకు సీడీఫోర్‌ పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీసుకోవాల్సి ఆహారం, జాగ్రత్తలు గురించి కౌన్సిలింగ్‌ ఇస్తారు. లింక్‌ ఎఆర్‌టీ కేంద్రంలో రోగులకు మందులు అందజేస్తారు. బ్లడ్‌బ్యాంక్‌లో బ్లడ్‌ క్రాస్‌ మేచింగ్, రక్తానికి హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌ఐవీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు.

జీతాలు అందకపోవడం వాస్తవమే... 

జిల్లాఎయిడ్స్‌ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారుల ను ప్రశ్నిస్తే ప్రోసెస్‌లో ఉందని చెబుతున్నారు.
– జె.రవికుమార్, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి  

మరిన్ని వార్తలు