తేలని ‘పంచాయతీ’!

11 Mar, 2018 01:27 IST|Sakshi

గడువు లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కష్టమే

కొలిక్కిరాని కొత్త పంచాయతీలు

మారుతున్న మార్గదర్శకాలతో ఆలస్యం

రిజర్వేషన్ల పరిస్థితీ అంతే.. ఎటూ తేల్చని ప్రభుత్వం

ముంచుకొస్తున్న పాలక వర్గం గడువు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగే పరిస్థితి కనిపించడంలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు, వార్డుల పునర్విభజన విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటమే ఇందుకు కారణమవుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను గడువు లో పు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాత్కాలిక షెడ్యూల్‌ ఖరారు చేసింది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకా రం ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పాల క వర్గాల పదవీ కాలం జూలై 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 3 నెలలు ముందుగా అంటే మే 31లోపే ఎన్నికలు నిర్వహించాలి. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

ఏర్పాటు కాని కొత్త పంచాయతీలు 
మెరుగైన గ్రామ పరిపాలనే లక్ష్యంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని, జనాభా ఆధారంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిం చింది. గడువు లోపు ఈ ప్రక్రియను ముగించే విషయంలో మాత్రం విఫలమవుతోంది. ప్రతిపాదనలు మారుతుండటంతో జిల్లాల నుంచి కొత్తగా ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. దీంతో పంచాయతీల ఏర్పాటు ఎంతకీ ముగియడంలేదు. వార్డుల విభజన పూర్తి కావడంలేదు. ఈ రెండు పూర్తయితేనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసే పరిస్థితి ఉంటుంది. రిజర్వేషన్లు నిర్ణయించిన తర్వాత పంచాయతీల జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. అనంతరం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరి స్థితి చూస్తే గడువు లోపు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్‌ అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో.. కొత్తది ఖరారు చేయాల్సి ఉంది. 

మారుతున్న ప్రతిపాదనలు
జనవరి 25 లోపే కొత్త గ్రామ పంచాయతీలపై అన్ని జిల్లాల అధికారులు.. పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపా లని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు 30 జిల్లాల్లో 4,122 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారు. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి పదేపదే కొత్త మార్గదర్శకాలు వస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులకు పాలుపోవడంలేదు. 500 జనాభా, 300 జనాభా ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారు. దీంతో కొత్త పంచాయతీలపై స్పష్టత రావడంలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కొత్త పంచాయతీలు ఎన్నో తేలనుంది. 

మరిన్ని వార్తలు