రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు

3 Dec, 2023 05:47 IST|Sakshi

 91.89% మందికి పింఛన్ల పంపిణీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అవ్వా­తాత­లు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మ­హి­­ళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొన­సాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు.

డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడు­దల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధి­దారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మి­గి­లిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు