దళితులపై ఇంకా దాడులా?

16 Jan, 2017 02:53 IST|Sakshi

గుండా మల్లేశ్‌

శంకర్‌పల్లి: దేశవ్యాప్తంగా దళితులపై ఇం కా దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర నేత, దళిత, గిరిజనుల హక్కుల సాధన జాతీయ కన్వీనర్‌ గుండా మల్లేశ్‌ అన్నారు. దళితులపై దాడులను అరిక ట్టాలంటూ నిర్వహిస్తున్న బస్సుయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చేరుకుంది. ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా దళితు లు నేటికీ కులవివక్ష,, అంటరానితనంతో అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయా లు నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన దళితుల హక్కులను పరిరక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యా ప్తంగా దాడులు మరింత ఎక్కువయ్యా యని తెలిపారు. దళితుడినే సీఎంను చేస్తాననే అబద్ధాల పునాదులపై ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వన్ని ఎండగట్టాలన్నారు.  దళితులకు మూడెకరాల భూమిని ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు