‘రైతు ఆత్మహత్యలు నివారించేం‍దుకే..’

25 Jun, 2018 18:47 IST|Sakshi
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు (పాత ఫొటో)

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు అన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ టన్నెల్‌ పనులను జాతీయ మీడియాతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు పనులను ఆయన మీడియాకు వివరించారు. ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో విదర్భ తర్వాత తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌గా మారారన్నారు. అందులో భాగంగానే వ్యాప్కోస్‌ సంస్థ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని హరీశ్‌ రావు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు