84 కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రారంభం

8 Jun, 2018 01:19 IST|Sakshi

నోటిఫికేషన్‌ జారీ: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

ఉపాధ్యాయ బదిలీల వెబ్‌సైట్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఉండ గా, అందులో 84 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్స రం నుంచే ఇంటర్మీడియట్‌ ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. కేబ్‌ కమిటీ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం కేజీబీవీల్లో 12వ తరగతి వరకు నిర్వహణకు చర్య లు చేపట్టిందన్నారు. అందులో భాగంగా 84 కేజీబీవీలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. వీటిల్లో ప్రవేశాలకు నోటిఫికే షన్‌ను జారీ చేశామన్నారు.

గురువారం సచివా లయంలో టీచర్ల బదిలీల వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీబీవీల్లో ప్రస్తుతం ప్రతి సెక్షన్‌కు 20 మందినే తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని 40కి పెంచాలని, ఆర్ట్స్, సైన్స్‌ గ్రూపులు ఉండేలా చూడాలని చేసిన సిఫార్సుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్‌ కాలేజీల్లోనూ కేజీబీవీ విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

కేజీ బీవీలను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ఇంటర్‌ సీట్లు లభించవన్న ఆందోళన ఉండదన్నారు. అప్‌గ్రేడ్‌ చేసిన ప్రతి 3 కేజీబీవీల్లో రెండింటిలో సైన్స్‌ గ్రూపులు, ఒక దాంట్లో ఆర్ట్స్‌ గ్రూపులు ప్రవేశపెడుతున్నామన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లోని 6.25లక్షల మంది బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ ఇస్తున్నామన్నారు. ఇందుకు  సీఎం రూ.100 కోట్లు కేటాయించారన్నారు.  

బాలికల కిట్స్‌పై విమర్శలేంటి?
కేజీ టు పీజీ ఏమైందని, ఈ కిట్స్‌ కొత్త పథక మేమీ కాదని కొందరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర వైద్య శాఖ కిశోర బాలిక స్వాస్థ్య యోజన పథ కం కింద బాలికలకు 6 రూపాయలకు 6 న్యాప్కిన్లు అందిస్తోందని, అదీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే ఇస్తోందన్నారు. ఇందుకు రూ.2.5 కోట్లే కేటాయించిందన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ పథకం బాగుందని, ప్రధానిని కలిసి దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతానని చెప్పారన్నారు.

ఉపాధ్యాయ బదిలీల వెబ్‌సైట్‌ ప్రారంభం
ఉపాధ్యాయ బదిలీల వెబ్‌సైట్‌ను (http:// transfers.cdse.telangana.gov.in)anfana.gov.in) ఈ సందర్భంగా కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ డిగ్రీ, జూని యర్, పాలిటెక్నిక్‌ కాలేజీల లెక్చరర్ల బదిలీల సమాచారం ఇందులో ఉందన్నారు. నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల బదిలీల సమాచారం ఉందన్నారు. కేజీబీవీలు కేంద్ర పథకం అయినందున అందులో బదిలీలు ఉండవన్నారు.

మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు ఆగస్టులో చేపడతామన్నారు. 8,792 మంది టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టామని, కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారన్నారు. త్వరలోనే కోర్టులో స్టే ఎత్తివేయించి భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలనే ఆలోచనలోనే ఉందన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఇచ్చిన 10% పెంపును అమలు చేయడం లేదన్నారు. 

మరిన్ని వార్తలు