‘మూసీ’ ఘటనపై విచారణ జరిపించాలి

7 Oct, 2019 08:20 IST|Sakshi
ప్రాజెక్టును సందర్శిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి

సాక్షి, నకిరేకల్: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం మూసీ ప్రాజెక్టు సందర్శించారు.  విరిగిపోయిన గేటను పరిశీలించి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న నీటి పరిమాణం, ప్రాజెక్టులో నీటిమట్టం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆలస్యంగా కురిసిన వర్షాలతో మూసీ నింకుకుండలా ఉండటంతో  రైతులు అనందంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో గేటు విరిగిపోవడం దురదృష్టకరమన్నారు.కాంట్రాక్టర్‌ పనులు చేస్తున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే మూసీకి పెనుప్రమాదం వాటిల్లిందని విమర్శించారు.  ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఇంజనీర్లు, మేధావులతో చర్చించి ప్రాజెక్టు గేటును పునరుద్ధరించాలని కోరారు.  ఎంపీ వెంట నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నా యక్, కేతేపల్లి ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, జెడ్పీటీసీ బి.స్వర్ణలత, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు దైదా రవీందర్, మండల అధ్యక్ష,ప్రధా న కార్యదర్శులు కోట పుల్లయ్య, ఎం.ప్రవీణ్‌రెడ్డి, నాయకులు బోళ్ల వెంకట్‌రెడ్డి, జ టంగి వెంకటనర్సయ్యయాదవ్, జి.రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్, బొప్పని సురేష్‌ ఉన్నారు.  

మరిన్ని వార్తలు