కోయిల్‌సాగర్'కు మహర్దశ

26 Oct, 2014 03:20 IST|Sakshi
కోయిల్‌సాగర్'కు మహర్దశ

దేవరకద్ర :
 కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం కోసం హైటెన్షన్ విద్యుత్ వినియోగానికి రూ. 34.57కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ. 31.06 కోట్లను మంజూరుచేస్తూ రాష్ట్ర కేబినేట్ శనివారం అనుమతిచ్చింది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ఫేజ్- 1  నర్వ మండలంలో ఉండగా,  ఫేజ్- 2 ధన్వాడ మండలంలో ఉంది.

రెండుచోట్ల విద్యుత్ మోటార్లను రన్ చేయడానికి హైటెన్షన్ విద్యుత్ వినియోగం అవసరం ఉండగా దీనికిగాను అధికారులు నిధుల కోసం ప్రతిపాదనలు చేశారు. జూరాల బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్‌కు నీటిని అందించే ప్రక్రియ అనధికారికంగా ఇటీవల వర్షాకాలంలోనే ప్రారంభించారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు