చెట్టుపైనే గీత కార్మికుడు మృతి 

17 Jun, 2018 04:53 IST|Sakshi

ఖిలా వరంగల్‌: గుండెపోటుతో ఓ గీత కార్మికుడు తాటిచెట్టుపైనే మృతిచెందిన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్‌ 8వ డివిజన్‌ ఖిలా వరంగల్‌ మధ్యకోట ప్రాంతానికి చెందిన పోశాల నాగరాజుగౌడ్‌ (35) కల్లు తీసేందుకు సాయంత్రం 4 గంటలకు కుమ్మరికుంటలోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే తాటి చెట్టుపైన ఉండగానే గుండెపోటు వచ్చి మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 6 గంటలకు తాటి చెట్టు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే నాగరాజుగౌడ్‌ మృతిచెంది చెట్టుపైన మోకుముస్తాదుతో వేలాడుతున్నాడు.

ఈ సమాచారం పోలీసులు, ఫైర్‌ అధికారులకు తెలియడంతో హుటాహుటిన చేరుకున్న వారు స్థానిక గీత కార్మికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య శైలజ, ఒక కూతురు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఎస్సై డేవిడ్‌ రాజు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితం..

ఈ పది రోజులే కీలకం: సీపీ అంజనీ కుమార్‌

రాజాధి'రాజ'..

రెడ్‌జోన్‌లోకి జిల్లాకేంద్రం

పాలమూరుకు ఢిల్లీ– మర్కజ్‌ దెబ్బ

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...