పెరిగిన వేతనాల కోసం నిరీక్షించాల్సిందే!

22 Apr, 2015 04:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణద్వారా పెరిగిన వేతనాలు అందాలంటే మరో నెల వేచి చూడాల్సిందే. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్చి వరకు పెరిగిన పీఆర్సీ వేతనాల్ని బకాయిల రూపంలోను, ఏప్రిల్ నుంచి నగదు రూపంలో మే 1న ఉద్యోగులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశమవుతోంది. ఉద్యోగుల పీఆర్సీ అమలు, బకాయిలు చెల్లింపుపై ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి రానుంది. కేబినెట్ నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులిస్తుంది. ఏ ఉద్యోగికి ఎంత వేతనం పెరుగుతుందనే లెక్క అప్పుడు తేలుతుంది. మే ఒకటో తేదీ వేతనంతో పెరిగిన వేతనాల చెల్లింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో పెరిగిన వేతనాల్నికూడా జూన్ ఒకటిన చెల్లించే వేతనంతో కలిపి నగదు రూపంలో అందించనున్నారు.
 

మరిన్ని వార్తలు