‘ముందస్తు’కు ముంపు మండలాల చిక్కు

25 Aug, 2018 13:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముంపు మండలాల ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత 2014లో పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపినప్పటికీ విలీన గెజిట్‌ మాత్రం ఇంకా వెలువడలేదు. దీంతో ఈ మండలాలు ఉన్న మూడు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో మార్పులు చేసే అంశంపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేకపోతోంది.

ఓటరు జాబితాలో సవరణ చేస్తేనే...
రాష్ట్ర పునర్విభజన తర్వాత భద్రాచలం, బూర్గంపాడు, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, రామచంద్రాపురం మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఈ ఏడు మండలాలు ప్రస్తుతం భద్రాచలం, అశ్వారావు పేట, పినపాక నియోజక వర్గాల్లో ఉన్నాయి. దీంతో ఓటర్లు ఆంధ్రాలో, ఎమ్మెల్యేలు తెలంగాణలోనూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో సవరణ చేస్తేనే ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.

మరిన్ని వార్తలు