వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి

17 Nov, 2019 16:50 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : వరి, పత్తి పంటలే కాకుండా అన్ని పంటలు పండించే విధంగా రైతులు ఆలోచన చేయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు, వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జతో కలిసి రైతుమిత్రా మొబైల్‌ యాప్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారికోసం ఏ ప్రభుత్వం చేయని పనులను చేస్తున్నామన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1200 కోట్ల రూపాయలను కేటాయించారని గుర్తించారు.

రైతులే తెలంగాణకు ముఖచిత్రమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్ల యువత కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలోనే మార్కెట్‌ కేంద్రాలు ఉన్నాయని, వాటి వల్ల ప్రతి గ్రామంలో 100 మంది అమాలీలకు ఉపాధి దొరికిందన్నారు. రైతు సమన్వయ సమితి ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇక హరీశ్‌రావు గురించి మాట్లాడుతూ.. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకొని మెదిలే గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావు  కృషి వల్లే తాను మంత్రి అయ్యానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు