మిర్చిః 18వేలు

7 Nov, 2019 05:11 IST|Sakshi

ఖమ్మం మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర

ఖమ్మం వ్యవసాయం: ‘తేజా’రకం మిర్చి ధర ఆల్‌టైం రికార్డు సాధించింది. మిర్చి సాగు చరిత్రలో ఈ ధర ఎప్పుడూ లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి బుధవారం క్వింటాలు ధర రూ.18,100 పలికింది. ఈ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్‌ ఉండటంతో ఈ ఏడాది జూలై నెల నుంచి ధర పెరుగుతూ వచి్చంది.  జూలైలో రూ.11 వేలు ఉన్న ధర..  రూ.18 వేలు దాటింది.  మిర్చి పండించే కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల ధర ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.

కిలో కొత్తిమీర.. రూ.150
విమానంలో తెప్పిస్తున్న వరంగల్‌ వ్యాపారులు
వరంగల్‌: భారీ వర్షాల కారణంగా కొత్తిమీర పంటలు  దెబ్బతినడంతో కిలో కొత్తిమీర బుధవారం వరంగల్‌లో రూ.150 పలికింది. స్థానికంగా కొత్తిమీర పంటలు దెబ్బతినడంతో కూరగాయల వ్యాపారులు బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ కూడా పంటలు పాడైపోవడంతో పంజాబ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. పంజాబ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా కొత్తిమీర తీసుకువచ్చి ఇక్కడికి సరఫరా చేసేలా ఆ రాష్ట్రంలోని వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నట్లు వరంగల్‌లోని లక్ష్మీపురం మార్కెట్‌కు చెందిన వ్యాపారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు