మిషన్‌కాకతీయతో సమృద్ధిగా నీరు

4 May, 2018 10:55 IST|Sakshi
చెరువు పనులుు ప్రారంభిస్తున్న చీఫ్‌విప్‌ ఈశ్వర్‌

ధర్మారం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో మరమ్మతు చేయడంతో చెరువుల్లో నీరు సమృద్ధిగా నిల్వ ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విఫ్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మండలంలో నాల్గవ విడత మిషన్‌ కాకతీయలో భాగంగా చామనపల్లి, రచ్చపల్లి, ఖానంపెల్లి గ్రామాల్లో చెరువులు, కుంటల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి విస్మరించగా టీఆర్‌ఎస్‌ హయాంలో రైతు సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించిందన్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు, కుంటల మరమ్మతులకు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పుస్కూరి జితెందర్‌రావు, పాక వెంకటేశం, ఎండీ. రఫీ, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ. అజాంబాబా, వైస్‌ ఎంపీపీ నార ప్రభాకర్, చింతల తిరుపతి, మూల మల్లేశం, సర్పంచులు పాలమాకుల ఉపేందర్‌రెడ్డి, ఐత స్వర్ణలత, అరుణ, ఎంపీటీసీలు మూల మంగ, వేల్పుల రేవతి, నాయకులు పాల్గొన్నారు.


వికలాంగులకు వీల్‌చైర్‌ అందజేత

మండలం పరిషత్‌ కార్యాలయంలో దివ్యాంగులకు చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ గురువారం వీల్‌చైర్‌లను అందించారు. నర్సింగపూర్‌కు చెందిన బుదారపు నర్సయ్యకు వీల్‌చైర్, వెల్గటూర్‌ మండలం పాతగూడూరుకు చెందిన జానవేణి తిరుపతికి ట్రైసైకిల్‌ అందించారు.

మరిన్ని వార్తలు