నాటిన ప్రతి మొక్క బతకాలి

2 Aug, 2018 13:03 IST|Sakshi
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో నాటిస్తున్న ప్రతి మొక్క బతకాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నంచర్ల గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలంటే అటవీసంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.  పాఠశాల, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల మొక్కలతో పచ్చబడాలని కోరారు.

గత ఏడాది హరితాహరం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను బతికించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాంతీబాయి, వైస్‌ ఎంపీపీ రాధారెడ్డి, ప్రిన్సిపల్‌ వెంకటమ్మ, సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ మగ్దూమ్, ఏపీఓ హరిచ్చంద్రుడు, ఎంపీటీసీలు చెన్నమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా