రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం: రోశయ్య

23 Apr, 2017 03:13 IST|Sakshi
రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం: రోశయ్య

► పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ‘మై లైఫ్‌’ ఆవిష్కరణ
► భావోద్వేగానికి గురైన జైపాల్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో నిజాయితీ, సేవాదృక్పథం, అధ్యయనం, అవగాహన చాలా ముఖ్యమని తమిళనాడు మాజీ గవ ర్నర్‌ కె.రోశయ్య అన్నారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు పి.నర్సారెడ్డి ఆత్మకథ ‘మై లైఫ్‌’ను శనివారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి. టీపీసీసీ మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ పండిట్‌ నారా యణరెడ్డి, టీపీసీసీ ముఖ్యనేతలు, పలువురు రిటైర్డు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లా డుతూ విషయాన్ని అవగాహన చేసుకుని, రాతపూర్వకంగా కూడా అద్భుతంగా ఆవిష్క రించడంలో నర్సారెడ్డి నిష్ణాతుడని అన్నారు. అధ్యయనం చేయడం, విషయాలపై అవగా హన కలిగి ఉండటంతోపాటు  రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న నర్సారెడ్డి అనుభవాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకథల్లోనూ, కథనంలోనూ నిజాయితీ ఉండాలన్నారు. రాజకీయాల్లో నిజాయితీతోనే ఉన్న నర్సారెడ్డి జీవిత చరిత్ర చదివితే కొత్త అంశాలు తెలుస్తాయన్నారు. నర్సారెడ్డితో అనుబంధా న్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి భావో ద్వేగానికి గురి కావడంతో ఆయన కళ్లు చెమ ర్చాయి.

నర్సారెడ్డి కూడా నిలబడి ఉద్వేగానికి లోనయ్యారు. నర్సారెడ్డి మాట్లాడుతూ డబ్బు ప్రమేయం రాజకీయాల్లో అపరిమితంగా పెర గడం వల్ల రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారంపై కాకుండా ఇలాంటి అంశాలు తెర పైకి రావడంతో రాజకీయాల్లో ఇమడలేక పోయానని విచారం వ్యక్తం చేశారు.  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో అంకిత భావంతో, ఉన్నతస్థాయిలో పనిచేసిన నర్సా రెడ్డి వంటివారి జీవిత చరిత్రలు అందరికీ ఉత్తేజకరంగా ఉంటాయన్నారు. టీపీసీసీ నేత పాల్వాయి స్రవంతి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు