కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం 

9 Nov, 2018 13:45 IST|Sakshi

సాగునీటికి పెద్దపీట వేస్తాం.

ఏడాదికి ఆరు సిలిండర్లు, ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు .

ఇంటిం‍టి ప్రచారంలో సంపత్‌ వెల్లడి..

సాక్షి, అలంపూర్‌: కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సతీమణి మహాలక్ష్మి అన్నారు. అలంపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపురంలో గురువారం తాజా మాజీ సతీమణి సంపత్‌ కుమార్‌ సతీమణి మహాలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడ్డాకుల రాము, రుక్ముద్దిన్, ఇంతియాజ్‌ అలీ ఉన్నారు.   


రైతులకు రెండు లక్షల రుణమాఫీ 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ వర్తింపజేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంతప్‌కుమార్‌ అన్నారు. అలంపూర్‌ మండలంలోని లింగనవాయి, క్యాతూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. మహేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, రాముడు, జయరాముడు పాల్గొన్నారు. 
శాంతినగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు చేసిందేమిలేదని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అన్ని విధాలా చేయూతనందిస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి అన్నారు. వడ్డేపల్లి మండలంలోని బుడమొర్సులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సతీమణి మాట్లాడారు. ఏడాదికి ఆరు సిలిండర్లు, ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు తదితర పథకాలను వివరించారు. 


పేదల పక్షపాతి..
ఇటిక్యాల: పేదలకు అన్ని విధాలుగా అండదండలు అందించేది కాంగ్రెస్‌ పార్టీయేనని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని  ఉదండాపురం, సాతర్ల, వావిలాల, శివనాం పల్లి, పెద్దదిన్నె, గోపాల్‌ దిన్నె గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వీఎస్‌టీ కంపెనీ స్టేజీ వద్ద ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయం వద్ద మండలంలో పలు గ్రామాల యువత సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 


రిజర్వాయరును నిర్మిస్తాం...
వచ్చే డిసెంబరు మాసంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని అప్పుడు సాగునీటికి పెద్దపీట వేస్తామని అన్నారు. ఆయన వెంట లక్ష్మినారయణ రెడ్డి, అనంతరెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, రంగారెడ్డి, పరమేశ్వరెడ్డి, ఎర్రసత్యం, నర్సింహులు ఉన్నారు. 
మానవపాడు: మండల పరిధిలోని పెద్దపోతులపాడులో గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బోరవెల్లి శేషిరెడ్డి, జగన్‌మోహన్, రవి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి
అయిజ: కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని, కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని యాపదిన్నె, గుడుదొడ్డి, వెంకటాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  
పేదలకు మేలు
రాజోళి: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు ఇంటింటికి కాంగ్రెస్‌ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల నుంచి వృద్ధుల సంక్షేమం వరకు అందరి కోసం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురుంచి తెలిపారు. జయన్న, దస్తగిరి, సుధాకర్‌ రెడ్డి, షాలు, చల్లా యూత్‌ నాయకులు సోమశేఖర్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, హసన్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు