ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన

17 Nov, 2019 04:58 IST|Sakshi

అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీకి వివరాలిచ్చిన ఎన్డీఎంసీ అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సి పల్‌ కౌన్సిల్‌ (ఎన్డీఎంసీ) పరిధిలోని రహదారుల మెరుగైన నిర్వహణ, అభివృద్ధి విధానా లను పరిశీలించడానికి జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల బృందం శనివారం ఇక్కడ పర్యటిం చింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి అర వింద్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎన్డీఎంసీ ఇంజనీర్లతో తెలం గాణ భవన్‌ ఆర్సీ గౌరవ్‌ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు సమావేశ మయ్యారు. ఇక్కడి తెలంగాణ భవన్‌ లో జరిగిన సమావేశంలో రహదారుల నాణ్యత, మరమ్మతులకు స్పందించే విధి విధా నాలను ఎన్డీఎంసీ ఇంజనీర్లు వివరించారు.ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బం ది రహదారుల నిర్వహణకు వాడే సామగ్రి, వాహనాల వివరాలు, సబ్‌వేల ఏర్పాటు, వాహనాల వేగం తగ్గించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు.

నిల్వ నీటిని తొలగించే విధానం, రోడ్‌ కటింగ్‌లో పాటించే నిబంధనలు, కాలనీ రోడ్ల నిర్వహణ, ప్రతి ఇంటి ముందు రోడ్లకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, బస్‌ షెల్టర్లు, సమాచార చిహ్నాల ఏర్పాటు, నీటిపారుదల వ్యవస్థ, కమ్యూ నికేషన్‌ వైరింగ్‌ గురించి జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లకు వివరించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్లు ఆర్‌.శ్రీధర్, మొహమ్మద్‌ జియా ఉద్దీన్, సూపరింటెండెంట్‌ ఇంజినీర్లు ఆర్‌.శం కర్‌ లాల్, టి.రవీంద్రనాథ్, పి.అనిల్‌ రాజ్‌ పాల్గొన్నారు. కాగా, ఎన్డీఎంసీ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ సంజయ్‌ గుప్తా, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ హెచ్‌పీ సింగ్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కేఎమ్‌ గోయల్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఆర్‌కే శర్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు