వడదెబ్బతో తొమ్మిది మంది మృతి 

25 Apr, 2018 03:51 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బతో తొమ్మిది మంది మృతిచెందారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో చిక్కుడు నర్సింహులు (35), నారాయణఖేడ్‌ జంట గ్రామం మంగల్‌పేట్‌కు చెందిన కుమ్మరి కృష్ణ(30), సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన కొల్లు సత్తయ్య (55), తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పోడెం కనకయ్య(78), మేళ్లచెరువు మండలం రేవూరుకు చెందిన చెరుకూరి కోటయ్య (45) ఎండవేడిమితో అస్వస్థతకు గురై మృతిచెందారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ నలుగురు మృతిచెందారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురానికి చెందిన పి.బక్కయ్య (62), మరిపెడ మండలం దేశ్య తండాకు చెందిన బానోతు చంద్రియా (50), గార్ల మండల కేంద్రానికి చెందిన మడుపు వెంకటనర్సమ్మ(85) ఎండ తాకిడికి అస్వస్థతకు గురై మృతి చెందారు. వరంగల్‌లోని 12వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన వృద్ధుడు పోతన విఠల్‌ (70) వడదెబ్బతో మృతి చెందాడు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు