‘రైతుబంధు’కు పరిమితిపై ప్రతిపాదన 

31 Dec, 2019 05:45 IST|Sakshi

మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : ‘రైతుబంధు’పథకం ఎన్ని ఎకరాలకు వర్తింపజేయాలన్న దానిపై పరిమితి విధించాలని ప్రతిపాదించామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని వెల్లడించారు. సోమవారం నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో 94%మంది రైతులకు ‘రైతుబంధు’నిధులు అందాయన్నారు. ఇంకా 6% మందికే ఇవ్వాల్సి ఉందని, వారికికూడా త్వర లోనే ఇస్తామన్నారు. రెన్యూవల్‌ చేసుకోవాలని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో రుణమాఫీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వేరుశనగ ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్న వనపర్తి జిల్లాలో ప్రత్యేక వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు