కార్డు చెల్లింపులపై జీరో చార్జీలు

12 Dec, 2016 15:19 IST|Sakshi
కార్డు చెల్లింపులపై జీరో చార్జీలు

ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసులు
లావాదేవీల చార్జీలను శాఖలే భరించాలి
స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పేదలకు రూ.1000 సబ్సిడీ ఇవ్వాలి
పాలు, రేషన్ దుకాణాల్లో మొబైల్ పేమెంట్లను ప్రోత్సహించాలి

సాక్షి, హైదరాబాద్: ఎయిర్లైన్స్ సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రైవేటు వ్యాపార సంస్థల తరహాలోనే డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీలను ప్రభుత్వ శాఖలే భరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సమావేశాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి పలు కీలక సిఫారసులు చేసింది. కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై జీహెచ్‌ఎంసీ, డిస్కంలు, జల మండలి సంస్థలు పౌరుల నుంచి 0.80 నుంచి 0.90 శాతం వరకు ట్రాన్సాక్షన్ చార్జీలను వసూలు చేస్తున్నారుు.

అరుుతే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీల భారాన్ని తప్పించాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. అలాగే ప్రభుత్వ శాఖలపై లావాదేవీల చార్జీల భారం ఉండని నెట్ బ్యాంకింగ్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పౌరులకు రారుుతీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నగదు రహిత లావాదేవీల అమలుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచలను ఆహ్వానించింది. వాటిని డిసెంబర్ 10లోగా  ఛ్చిటజ్ఛిటట.టఠట్ఛటజిఃజఝ్చజీ.ఛిౌఝకు పంపాలని కోరింది.

ఇతర ముఖ్య ప్రతిపాదనలు ఇవీ..
ప్రభుత్వానికి ఆదాయార్జన తెచ్చి పెట్టే శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి.  రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖల తరహాలో జరిగే భారీ లావాదేవీలు నెట్‌బ్యాంకింగ్/ఎన్‌ఈఎఫ్‌టీ/ఆర్టీజీఎస్‌ల ద్వారా జరిగేలా చూడాలి  వినియోగదారుల నుంచి కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు వ్యాట్ డీలర్లందరికీ స్వైపింగ్ యంత్రాలను అందించాలి  రూ.20వేలకు మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలి

మార్కెట్‌యార్డులు, సహకార సొసైటీలు రైతుల ఖాతాలకు ఆన్‌లైన్ చెల్లింపులు జరపాలి  నగదు రహిత చెల్లింపులపై సహకార సొసైటీలు రైతులకు సరుకులు విక్రరుుంచాలి  అన్ని రేషన్ దుకాణదారులు, పాల సమాఖ్యలోని పాల విక్రయదారులు, ఇతరులు తమ వినియోగదారులకు బడ్డీ/పాకెట్స్/పేటీఎం తదితర యాప్‌ల సాయంతో మొబైల్ పేమెంట్‌లు జరిపేందుకు అవకాశం కల్పించాలి  పాల వ్యాపారులు, రేషన్ డీలర్ల నుంచి చెల్లింపులను నెట్ బ్యాంకింగ్/ఎన్‌ఈఎఫ్‌టీ/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పాల సమాఖ్యలు, పౌర సరఫరాల సంస్థ స్వీకరించాలి  రైతు బజార్లలో మొబైల్ పేమెంట్లు లేదా కూపన్లతో చెల్లింపులు జరిపే వ్యవస్థను తేవాలి  ఎల్పీజీ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు స్వీకరించాలి

కూరగాయలు, కిరాణ వస్తువుల వంటి తక్కువ ధర లావాదేవీల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక పారుుంట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలు, యాప్‌లను ప్రవేశపెట్టాలి  నగదు రహిత చెల్లింపులపై పురోగతిని సమీక్షించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్య ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులతో రాష్ట్ర, జిల్లా స్థారుుల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి

ప్రతి మండలంలో బ్యాంకు అధికారులు, బ్యాంకు మిత్రలతో నగదు రహిత సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయాలి

పేద కుటుంబాలు ఆన్‌లైన్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు 25 శాతం సబ్సిడీని రూ.1000కు మించకుండా ప్రభుత్వం చెల్లించాలి  ఆన్‌లైన్ లావాదేవీలకు అవసరమైనంత మేరకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం లేదు. ప్రచార కార్యక్రమాల ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలి   ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకు అధికారులు నగదు రహిత, కార్డు, ఆన్‌లైన్, మొబైల్ పేమెంట్ల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలి  జిల్లాల్లో పౌరుల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు జిల్లా స్థారుులో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి

మరిన్ని వార్తలు