బళ్లో మందు బాబుల చిందులు

24 Nov, 2018 14:37 IST|Sakshi
బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామంలో ప్రహరీ లేని పాఠశాల,  ప్రహరీ లేని హిప్నెల్లి పాఠశాల

జిల్లాలో మొత్తం 950 పాఠశాలలు   

126 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 

90 ప్రాథమికోన్నత పాఠశాలలు  

737 ప్రాథమిక పాఠశాలలు  ప్రహరీలు ఉన్నవి..  

43 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు  

24 ప్రాథమికోన్నత పాఠశాలలు  

102 ప్రాథమిక పాఠశాలలు  

తానూరు(ముథోల్‌): ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి  మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇక్కట్ల మధ్య చదువును కొనసాగించే పరిస్థితి నెలకొంది. అదనపు తరగతి గదులు, నీటివసతి, ఆటస్థ లాలు, పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగజీవాలు సంచారం చేస్తున్నాయి. దీంతో పాఠశాల మైదానాలు దుర్గంధమవుతున్నాయి. విద్యార్థులు ఆటలు ఆడుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పాఠశాలల్లో దుర్గంధం వెదజల్లుతుండడంతో వాసన భరించలేకపోతున్నారు. ప్రహరీలు లేకపోవడం తో పాఠశాలలకు రక్షణ కరువైంది. మధ్యాహ్న భోజన సమయాల్లో మూగ జీవాలు  విద్యార్థులకు ఇ బ్బందులు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప ర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మ కంగా ప్రా రంభించిన హరితహారంలో భాగంగా నాటిన మొ క్కలు  జంతువులు తినేస్తున్నాయి. దీంతో మొ క్కలు నాటిన మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది.
 
సగానికిపైగా .... 
నిర్మల్‌ జిల్లాలోని సగానికిపైగా ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రహరీలు లేవు. జిల్లాలో మొత్తం 953 పాఠశాలలున్నాయి. ఇందు లో 126 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 90 ప్రాథమికోన్నత పాఠశాలలు, 737 ప్రాథమిక పాఠశాలాలున్నాయి. ఇందులో 43 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో, 24 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 102 ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రహారీలు నిర్మించారు. మిగితా పాఠశాలాలకు ప్రహరీలు లేకపోవడంతో  ,విద్యార్థులకు ఇబ్బందులు తప్ప డం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగ జీవా లు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు విద్యను అభ్యసిస్తుండడంతో మూగ జీవాలతో ప్రమాదం పొంచి ఉందని పోష కులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్న క్షేత్ర స్థాయిలో సరైన రీతి లో అమలు కావడం లేదని సర్వత్రా చర్చించుకుంటున్నారు.  

హరితహారం మొక్కలకు రక్షణ  ఏది? 
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరితహారంలో భా గంగా నాటిన మొక్కలు పెరిగే దశలోనే మూగజీ వాలు తమ ఆహారంగా వినియోగించుకుంటున్నా యి. పచ్చని తెలంగాణ  ధ్యేయంగా ప్రభుత్వ పా ఠశాలలు, కార్యాలయాలు, కళాశాలల్లో మొక్కల ను నాటే కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు సైతం మొక్కల రక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. పాఠశాలలకు ప్రహారీ లేకపోవడంతో హరితహారం మొక్కలకు జంతువులు నష్టం కలిగిస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు పెట్టి నాటిన మొక్కలకు రక్షణ కరువైందని పేర్కొంటున్నారు. వ్యయ ప్రయాసలకు గురై నాటిన మొక్కలు తమ కళ్ల ఎదుట జంతువులకు ఆహారంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రహరీలు నిర్మించాలని కోరుతున్నారు.
 

మందుబాబులకు అడ్డాగా .. 

                        బెల్‌తరోడ పాఠశాలలో మందు సీసాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రాత్రి వేళలో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. రాత్రి వేళలో పాఠశాల ఆవరణలో కూర్చుని మందు తాగి బాటిళ్లను అక్కడే పారేస్తున్నారు. దీంతో పాఠశాల మైదానం మందు బాబులకు స్థావరంగా మారింది.రాత్రి వేళల్లో పేకాటరాయుళ్లకు ఆవరణ అనుకూలంగా మారింది. ప్రతి రోజు పాఠశాల ఆవరణలో మందు సీసాలు, సారా ప్యాకెట్లు  ,గూట్కా ప్యాకెట్ల ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు  ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత శాఖాధికారులు స్పందించి పాఠశాలలకు ప్రహరీని నిర్మించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.  

మరిన్ని వార్తలు