-

ఉస్మానియా భూములు తీసుకోవడం సరికాదు: శ్రీధర్‌బాబు

19 May, 2015 19:44 IST|Sakshi

మంథని(కరీంనగర్): ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకుని అందులో పేదలకు ఇళ్లు కట్టించాలనే యోచన సబబు కాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు.

ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కల్గించే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఇళ్లు కడతామనడం సరైంది కాదన్నారు. విశ్వవిద్యాలయూన్ని దూరదృష్టితో ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో జనాభా పెరిగి అనేక మంది పేద విద్యార్థులు అందులో చేరే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయం భూమిని కాకుండా మరోచోట కొనుగోలు చేసి ఇళ్లు కట్టించాలని సూచించారు.

మరిన్ని వార్తలు