చేపల కేంద్రంపై నిర్లక్ష్యం

12 Jul, 2014 01:35 IST|Sakshi
చేపల కేంద్రంపై నిర్లక్ష్యం

 కడెం : జిల్లాలోనే పెద్దది కడెంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ఏటా రూ.మూడు కోట్ల వరకు చేప పిల్లల ఉత్పత్తి జరిగేది. కేంద్రంలో అధికార్లు,సిబ్బంది కూడా పూర్తిస్థాయి లో ఉండేవారు. దశాబ్దకాలంగా కేంద్రం నిరాదరణకు గురవుతోంది. అధికార్లు,సిబ్బంది మూడేళ్లక్రితం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కేంద్రం అధికారి పోస్టును లక్షెట్టిపేటలోని అధికారికి ఇన్‌చార్జి  బాధ్యతలు అప్పగించారు.

 కేంద్రంలో దాదాపుగా 55 వరకు నీటి తొట్టిలు, చేప పిల్లలను ఉత్పత్తి చేసే హాచరీలు, జనరేటర్ గది, అధికారి కార్యాలయం,సిబ్బంది గదులు,మ్యూజియం హాలు,సమావేశం గది ఉన్నాయి. వీటన్నింటినీ గాలికి వదిలేశారు. తల్లి చేపలుండే నాలుగు పెద్ద కుంటలున్నాయి. వాటికీ రక్షణ లేదు. కేంద్రంలో ఇద్దరు మత్య్సకేంద్రాభివృద్ధి అధికార్లు, క్షేత్ర సహాయకులు ఐదుగురు, ఇతర సిబ్బంది ముగ్గురు స్థాని కంగా ఉండడంలేదు. కేంద్రానికి ఇన్‌చార్జి ఎఫ్‌డీవోలు ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. మత్స్య కార్మికుల ఉపాధికోసం గతంలో రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాల నుం చి చేప పిల్లలను తెచ్చి ఇక్కడ పెంచి కడెం రిజర్వాయర్లో వేసేవారు. మూడేళ్లుగా తెప్పించడం లేదు.

మరిన్ని వార్తలు