టీఆర్‌ఎస్‌లో పెద్దపల్లి పంచాయితీ

28 Dec, 2018 04:35 IST|Sakshi

మాజీ ఎంపీ వివేక్‌పఎమ్మెల్యేల ఫిర్యాదులు

కేటీఆర్‌ను కలిసినఈశ్వర్, మనోహర్‌రెడ్డి, సుమన్‌

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనం తరం టీఆర్‌ఎస్‌లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో మాజీ ఎంపీ వివేక్‌ టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఎమ్మెల్యే లు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై పలువు రు ఎమ్మెల్యేలు నేరుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్‌(ధర్మపురి), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), బాల్క సుమన్‌(చెన్నూరు), సోమారపు సత్యనారాయణ(రామగుండం) గురువారం తెలం గాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, తమకు ఇబ్బంది కలిగించేలా వివేక్‌ వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్‌ ఇద్దరూ కలిసి, సోమారపు సత్యనారాయణ వేరుగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

వివేక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారని... బెల్లంపల్లిలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు వినోద్‌కు సహకరిం చారని కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ కృతజ్ఞత సభలోనూ పలువురు ద్వితీయశ్రేణి నేతలు ఎంపీ వివేక్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ధర్మపురి, బెల్లంపల్లి, చెన్నూరులో బహిరంగంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్‌ సైతం గురువారం కేటీఆర్‌ను కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఎన్నికల పరిస్థితులపై కేటీఆర్‌తో మాట్లాడారు. తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని వివేక్‌ కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసిం ది. ఫిర్యాదులు, వివరణ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎంపీ వివేక్‌తో కేటీఆర్‌ శుక్రవారం మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా